శుభ ముహూర్తములు

Rate this page

ముహూర్తము

ముహూర్తము అనగా శుభ సమయం అని లోక నానుడి. వాస్తవానికి ముహూర్తము అనగా రెండు ఘడియల కాలము అని అర్ధము. ఒక ఘడియ అనగా ప్రస్తుతం మన వాడుకలోఉన్న కాలమానములో షుమారు 24 నిమిషముల కాల ప్రమాణము అవుతుంది. అప్పుడు ముహూర్తమంటే షుమారు 2 x 24 = 48 నిమిషముల కాలం అవుతుంది. నిజానికి శాస్త్రరీత్యా అహః ప్రమాణాన్ని 5 తో భాగించగా వచ్చే కాలము పగటి కాలములో ముహూర్తం అవుతుంది. అదే విధంగా రాత్రి ముహూర్తముకూడా లెక్క గట్టాల్సి ఉంటుంది. అహః ప్రమాణము రాత్రి ప్రమాణము కలిసి ఒక దిన ప్రమాణము అవుతుంది. ఒక దిన ప్రమాణము అనగా 60 ఘడియలు.

(ఎవరికి వారు స్వంతముగా ముహూర్తము చూసుకోవడము మంచిది కాదు. ఒక జ్యోతిష్కుని లేక దైవజ్ణుని తప్పనిసరిగా సంప్రదించవలెను.)

అహః ప్రమాణము రాత్రి ప్రమాణముల అలాగే దిన ప్రమాణము కుడా ప్రతీ రోజు మారుతు ఉంటాయి. కాబట్టి ముహూర్త కాల ప్రమాణము కూడా మారడం సహజం.

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

శుభ తిథులు

ఒక మాసమునకు 30 తిథులు. శుక్ల పక్షములో 15 కృష్ణ పక్షములో 15 మొత్తము 30 తిథులు. శుక్ల పక్షములో చివరి తిథి పౌర్ణమి. కృష్ణ పక్షములో చివరి తిథి అమావాస్య.

సాధారణంగా విదియ, తిదియ లు, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి తిథులు మంచివి అనుకుంటాము. కాని పురాణ కాలంలో ద్వాదశి మంచిదని ఉంది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే రామాయణ కాలంలో తిథులు, నక్షత్రముల స్టితి గతులను బట్టి జ్యోతిషం చెప్పబడింది. వారము రోజుల ప్రసక్తి లేదు.

శుభ ముహూర్తములు,తిథి సంజ్ఞలు,శుభ తిథులు,నంద తిథులు,భద్ర తిథులు,జయ తిథులు,రిక్త తిథులు,పూర్ణ తిథులు,సిద్ధ తిథులు,త్రివిధ నవమి,ఘడియ,ముహూర్తము,శుభ ముహూర్తము

ప్రస్తుతం తిథుల లకు వారము రోజులకు గల సంబంధము లను బట్టి అవి శుభ సమయములా కాదా బేరీజు వేయడం జరుగుతుంది. వారములో రోజులు 7 ఉంటాయి. తిథులు 15. ఒక మాసములో ఈ 15 తిథులు రెండు సార్లు వస్తాయి. వాస్తవానికి తిథులను సంద, భద్ర, జయ, రిక్త,, పూర్ణ 5 రకములుగా విభజించారు. అవి ఈ క్రింది విధముగా తెలుసుకొనవచ్చును.

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

నంద తిథులు

ప్రతిపద లేక పాడ్యమి, షష్టి, ఏకాదశి ఈ మూడును నంద తిథులు.

భద్ర తిథులు

విదియ, సప్తమి, ద్వాదశి ఈ మూడు భద్ర తిథులు.

జయ తిథులు

తదియ ( తృతీయ ), అష్టమి, త్రయోదశి ఈ ముడు జయ తిథులు.

రిక్త తిథులు

చవితి ( చతుర్థి ), నవమి, చతుర్దశి ఈ మూడును రిక్త తిథులు.

పూర్ణ తిథులు

పంచమి, దశమి, పౌర్ణమి – వీటికి పూర్ణ తిథులు అని పేరు.

వారము ( రోజు ) లతో తిథులను కలిపి తత్సంబంధ శుభాశుభ విశేషములను ఈ క్రింది విధముగా బేరీజు వేస్తారు.

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

ALSO READ MY ARTICLES ON

సిద్ధ తిథులు

ఈ క్రింద ఉదాహరించినవి సిద్ధ తిథులు అనగా ఇవి శుభ ప్రదములు:

శుక్ర వారము నాటి నంద తిథులు – పాడ్యమి, షష్టి, ఏకాదశి శుభాన్ని చేకూరుస్తాయి.

నా ఈ పేజీలు  కూడా చదవండి

బుధవారము నాటి భద్ర తిథులు – విదియ, సప్తమి, ద్వాదశి శుభాన్ని చేకూరుస్తాయి.

మంగళ వారము నాటి జయ తిథులు – తదియ, అష్టమి, త్రయోదశి శుభాన్ని చేకూరుస్తాయి.

శని వారము నాటి రిక్త తిథులు – చవితి, నవమి, చతుర్దశి శుభాన్ని చేకూరుస్తాయి.

గురు వారము నాటి పూర్ణ తిథులు – పంచమి, దశమి, పౌర్ణమి శుభాన్ని చేకూరుస్తాయి.

పైన తెలుప బడిన సిద్ధ తిథులు మంచివి అనగా శుభ కరమయినవిగా భావిస్తారు.

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

త్రివిధ నవమి

త్రివిధ నవమి విశేషము:

నవమి విషయములో ఈ క్రింది శ్లోకమును పరిశిలిద్దాము.

ప్రవేశాన్నిర్గమం తస్మాత్ర్పవే శనవమేతిథౌ

నక్షత్రేపి తథావారే నైవ సుర్యాత్కదాచన

ఒక సారి ప్రయాణము చేసి ఇంటికి వచ్చిన తరువాత తొమ్మిదవరోజు తిరిగి ప్రయాణము చెయ్యకూడదని పై శ్లోకము చెబుతుంది. అట్లాగే ప్రయాణమునకు బయలు దేరిన రోజు మొదలుకుని (తోలి రోజు కుడా లెక్క కట్టాలి) తొమ్మిదవరోజున తిరిగి ఇంటికి రాకూడదు. అట్లాగే నవమి తిథి ఉన్నరోజును ప్రత్యక్ష నవమి అంటారు. అంచేత నవమి రోజున కూడా ప్రయాణమునకు బయలు దేర కూడదు. ( సూచన: ఇంత చాందస్తంగా ప్రయాణాలు చెయ్యలన్న ప్రయాణాలు మాని వేయాలన్న ప్రస్తుత కాలములో వీలు కాదు అని మనకు తెలిసిందే. అయితే శాస్త్రము మానవుని జీవన గమనానికి తిథి ముహూర్త సమయాలకు గల అవినాభావ సంబంధాన్ని ఎంత చక్కగా బేరీజు వేసి చెప్పిందో తెలుసుకోవడానికి మాత్రమె ఈ పై శ్లోకమును దాని వివరణను ఇక్కడ చెప్పడమైనదని గమనించవలెను. )

Facebook20
X (Twitter)20
LinkedIn20
Share
WhatsApp20