నమః శివాయ అను మంత్రములో అయిదు అక్షరములు ఉంటాయి గనుక ఈ మంత్రమును పంచాక్షరీ మంత్రము అంటారు. దీనిలో ప్రతి అక్షరము పవిత్రమైనదే అని ప్రతి అక్షరమునకు గల అర్ధమును వివరిస్తూ శివుని స్తుతించే స్తోత్రమిది. (శివాష్టకం, లింగాష్టకం, శ్రీ రుద్రం నమకమ్, చమకం శివ తాండవ స్తోత్రమ్, చంద్రశేఖరాష్టకం వేరే పేజీలలో ఉన్నవి చూడగలరు)
పంచాక్షరి మంత్రము
అర్థము: ఆయన యొక్క దివ్య కంఠమును నాగరాజు వాసుకి ఎల్లప్పుడూ అలంకరించి ఉంటాడు, ఆయన త్రినేత్రుడు, ఆయన ఎల్లప్పుడు ముల్లోకములను సమదృష్టితో వీక్షిస్తుంటాడు. ఆయన శరీరమునకు దివ్య భస్మము పూసుకుని ఉంటాడు. ఆయనే మహేశ్వరుడు. ఆయన త్రికాలములలోనూ వ్యవస్తితుడై ఉంటాడు. ఆయన చిరంజీవి. ఆయన పరమ పరిశుద్ధుడు. ఆయన తన శరీరముపై ఏవిధమయిన ఆచ్చాదన లేకుండా దిక్కులనే అంబరములుగా కలిగి ఉంటాడు. ఆయన నమః శివాయ అను ఈ పంచాక్షరీ మంత్రములోని న కారములో నెలకొని ఉంటాడు. ఆ మహేశ్వరునికి భక్తిపూర్వక నమస్కారములు.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాధ మహేశ్వరాయ|
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మ కారాయ నమ: శివాయ:||
నా ఈ పేజీలు కూడా చదవండి
- మహాత్మా గాంధీ 1869-1915
- జవహర్లాల్ నెహ్రూ 1889-1940
- డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
అర్థం: మందాకినీ నది నుంచి తెచ్చిన నీటిని కలిపి తయారుచేసిన గంధము తో ఆయన ప్రతిరూపమయిన లింగమునకు లేపనము చేస్తారు. ఆయన నందీశ్వరునికి ప్రమదగణములకు ఆదినాధుడు. ఆయనే మహేశ్వరుడు. ఆయనను ప్రముఖంగా మందార పుష్పం తోనూ మరియు ఇతర దివ్య పుష్పములతోను పూజిస్తున్నాను. ఆయన నమః శివాయ అను ఈ పంచాక్షరీ మంత్రములోని మ కారము లో నెలకొని ఉంటాడు. ఆ మహేశ్వరునికి భక్తిపూర్వక నమస్కారములు.
శివాయ గౌరీ వదనాబ్జబృంద సూర్యాయ దక్షాద్వరనాశకాయ|
శ్రీ నీలకంఠాయ వృషభ ధ్వజాయ తస్మై శి కారాయ నమ: శివాయ:||
అర్థం: గౌరీ దేవి మననులో సూర్యునివలే ప్రకాశిస్తూ ఉండేవాడు, దక్షునికి దర్పమునకు కారణమయిన వరములను నాశనము చేసినవాడు ఆయనే మహా శివుడు. ఆయనే నీల కంఠుడు, నందీశ్వరుని చిహ్నము జెండాపై కలిగి ఉండేవాడు, ఆయన నమః శివాయ అను ఈ పంచాక్షరీ మంత్రములోని శి కారము లో నెలకొని ఉంటాడు. ఆ మహేశ్వరునికి భక్తిపూర్వక నమస్కారములు.
వషిష్ఠ కుంబోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ|
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వ కారాయ నమ: శివాయ:||
అర్థం: ఎవరైతే వశిష్ట, గౌతమ, మరియు కుంభోద్భవుడైన అగస్త్య మునీశ్వరుల చేత మరియు దేవగణముల నుంచి పూజలు అందుకుంటూ ఉంటాడో ఆయనే గణశేఖరుడు ముల్లోకములకు ఆరాధ్య దైవము. ఆయన చంద్ర వంశముల వారిని, సూర్య వంశముల వారిని, వైశ్వానరులను అందరిని ఆ ముక్కంటి శుభ దృష్టి తో వీక్షిస్తాడు. ఆయన నమః శివాయ అను ఈ పంచాక్షరీ మంత్రములోని వ కారము లో నెలకొని ఉంటాడు. ఆ మహేశ్వరునికి భక్తిపూర్వక నమస్కారములు.
ఈ స్తోత్రములను కూడా చదవండి
యజ్ఞస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ|
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై య కారాయ నమ: శివాయ:||
అర్థం: యజ్ఞమునకు ప్రతిరూపమయిన వాడు, జటలను ధరించియుండేవాడు, పినాక అను నామము కలిగిన ధనుస్సును చేతబూని యుండేవాడు, ఆయనే సనాతనుడు మహేశ్వరుడు. దివ్యశక్తి తో ప్రకాశించే వాడు, వంటిపై ఆచ్చాదన లేకుండా సంచరించువాడు ఆయనే మహేశ్వరుడు. ఆయన నమః శివాయ అను ఈ పంచాక్షరీ మంత్రములోని య కారము లో నెలకొని ఉంటాడు. ఆ మహేశ్వరునికి భక్తిపూర్వక నమస్కారములు.
పంచాక్షరమిదం పుణ్యం య: పఠేత్ శివ సన్నిధౌ|
శివలొక మవాప్నొతి శివేన సహ మోదతే||
వేద సూక్తములకోరకు ఈ క్రింది బటన్ లపై క్లిక్ చెయ్యండి.
అర్థం: ఓం నమః శివాయః అను ఈ పంచాక్షరీ మంత్రమును ఎవరయితే శివ సన్నిధిలో పఠీస్తారో వారికి తప్పక శివలోక ప్రాప్తి కలుగుతుంది. శివ దేవుని సాక్షాత్కారము కలుగుతుంది. సుఖ సంతోషములు సంప్రాప్తిస్తాయి.
నాగెంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహెశ్వరాయ|
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై ’ న ’ కారాయ నమః శివాయః||
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
ALSO READ