నాసదీయ సూక్తం

Rate this page

నాసదీయ సూక్తం ఋగ్వేదం లోని పదవ మండలంలో 129 వ సూక్తం గా ఉంటుంది. ఈ సూక్తం శ్రుష్టి రహస్యాన్ని గురించి వివరిస్తుంది. అయితే ఈ నాసదీయ సూక్తం (नासदीय-सूक्त) లోని విశేషం ఏమిటంటే ఒక ప్రక్క శ్రుష్టి ఇలా జరిగి ఉంటుంది అని చెబుతూనే అలా జరిగిందని ఎవరికీ తెలియదు అంటూ చమత్కరిస్తుంది. అందుచేత విదేశీయులు ఈ సూక్తాన్ని ఎక్కువగా కొనియాడతారు.

శాంతి మంత్రం

ఓం తచ్ఛమ్ యోరావృణీమహే

గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞ పతయే

దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః

ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే

ఓం శాంతిః శాంతిః శాంతిః

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

అర్థం: మాకు ఎవరైతే ఎల్లప్పుడూ మంగళకరాన్ని అనుగ్రహిస్తుంటారో ఆ భగవానుని ప్రార్ధిస్తున్నాము. ఈ యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగు గాక! యజ్ఞపతికి శుభమగుగాక! దేవతలకు శుభమగుగాక! మానవులకు మేలు జరుగు గాక! మాకు గల ద్విపద చతుష్పద జంతువులకు శుభమగుగాక! ఔషదములు (వ్యవసాయపు మొక్కలు) శీఘ్రగతిన పెరుగుగాక!

ఓం శాంతిః శాంతిః శాంతిః

నాసదీయ సూక్తం,శాంతి మంత్రం,ఋగ్వేదం,పదవ మండలం

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

ఓం నాసదాసీన్నో సదాసీత్ తదానీం నాసీద్రజో నో వ్యోమాపరో యత్

కీమావరీవః కుహ కస్య శర్మన్నంభః కీమాసీద్గహనం గభీరం

అర్థం: బహుశా సృష్టికి ముందు అంతా శూన్యం వ్యాపించి ఉండి ఉంటుంది. అసలు శూన్యమే లేదేమో. భూమి లేదు. ఆకాశం లేదు మరియు ఆకాశానికి అవతల కూడా ఏమీ లేదు. శ్రుష్టిని చెయ్యడానికి ముందు ఈ జగత్తు ఒక మూత తో కప్పబడి ఉందా? ఆ మూతను దేంతో తయారు చేశారు. ఆ మూత కొలతలు ఏమిటి? అసలు ఆ మూత ఉందా? ఇది ఎవరికి తెలుసు? ఇది దేవునికైనా తెలుసా?

నా ఈ పేజీలు  కూడా చదవండి

న మృత్యురాసీదమృతమ్ న తర్హి న రాత్ర్యా ఆహ్న ఆసీత్ ప్రకేతః

ఆనీదవాతం స్వధయా తదేకం తస్మాద్ధాన్నన్న పరః కిం చనాస

అర్థం: అపుడు మృత్యువు లేదు. మరియు జీవితం కూడా లేదు. పగలు, రాత్రి సంజ్ఞలు లేవు. స్వయంగా శ్వాసించని దేవుడు తన దైవిక శక్తులను ఉపయోగించి ఊపిరి పీల్చుకున్నాడు.  

తమ ఆసీత్ తమసా గూఢమగ్రే2ప్రకేతం సలిలం సర్వమా ఇదం

తుచ్ఛ్యేనాభ్వపిహితం యదాసీత్ తపసస్తన్మహినాజాయత్రైకం

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

అర్థం: శ్రుష్టికి ముందు సర్వత్రా చీకటి వ్యాపించి ఉండేది. ఆ చీకటి చుట్టూ చీకటి చుట్టు ముట్టి ఉంది. ప్రతిచోటా నీరు వ్యాపించి ఉంది. కానీ ఆ నీటిని ఎవ్వరూ స్పృశించ లేరు. భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందాడు. కానీ ఆయన కూడా శూన్యమే. ఆయన చుట్టూ శూన్యమే. అయితే ఆయన తన తపో శక్తి ద్వారా ఆయన తనకు తాను ప్రకటిత మౌతున్నాడు.   

కామస్తదగే సమవర్తతాధి మనసో రేతః ప్రథమం యదాసీత్

సతో బంధుమ్సతి నిరవిన్దన్ హృది ప్రతీప్యా కవయో మనీషా

అర్థం: మనుష్యుల మనస్సులలో మొలకెత్తిన కామమే ఈ సృష్టికి కారణమని ఋషులు కనుగొన్నారు. ఋషులు తమ దైవిక శక్తులను ఉపయోగించి సత్యానికి అసత్యానికి మధ్య సంబంధం తెలుసుకున్నారు.  

తిరశ్చీనో వితతో రశ్మిరేషా మధః స్వేదాసీ3దుపరి స్విదాసీ3త్

రేతోధా ఆసన్ మహిమాన ఆసంత్స్వధా అవస్తాత్ ప్రయతిః పరస్తాత్

అర్థం: సృష్టి యొక్క అనంత శక్తి యొక్క కిరణాలు విశ్వమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ విశ్వ కిరణాలు పైకి క్రిందికి మరియు అన్ని దిశలలో అత్యంత వేగంతో వ్యాపిస్తున్నాయి.

కో అద్దా వేద క ఇహ ప్రవోచత్ కుత అజాతా కుత ఇయం విసృష్టిః

అర్వార్గ్ద అస్య విసర్జనేనా2థా కో వేద యత ఆబభూవ

అర్థం: అయినా ఈ సృష్టి ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైందో ఎవరికి నిజంగా తెలుసు. ఎవరు మాకు ఆ నిజం చెప్పగలరు? ఋషులు సృష్టి జరిగిన తరువాత జన్మించారు. కాబట్టి వారికి ఆ నిజం సరిగ్గా తెలియకపోవచ్చు.

ఇయం విసృష్టిర్యత ఆబభూవ యది వ దధేయది వా న

యో అస్యాధ్యక్షః పరమే వ్యోమంత్సో అంగ వేద యది వా న వేద 

అర్థం: ఈ శ్రుష్టి కార్యం ఎక్కడ నుండి మొదలయింది మరియు ఈ అనంత విశ్వాన్ని ఏ శక్తి మోస్తుంది? ఇది ఎవరికి తెలుసు? దానిని సృష్టించిన దేవునికి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది, కానీ ఆయనకు కూడా తెలియదేమో!

ALSO READ MY ARTICLES ON

Facebook20
X (Twitter)20
LinkedIn20
Share
WhatsApp20