త్రిఋణములు

Rate this page

పితృ ఋణములు, ఋషి ఋణములు, దైవ ఋణములు ఏ మూడింటిని కలిపి త్రిఋణములు (Tririanas) అంటారు. మానవుడు అతనికి జన్మనిచ్చిన పితృదేవునికి, దేవునికి మరియు విద్యా బుద్ధులు నొసంగిన ఋషులకు రుణపడి ఉంటాడు. ఈ ఋణములను నివృత్తి చేసుకోవడానికి ఆశ్రమ ధర్మములు నిర్వర్తించవలెను.

భారత దేశంలోని హైందవ సంస్కృతి చాలా ఉన్నతమయినది. వివిధ ప్రాంతాలనుండి భారతదేశానికి వలస వచ్చిన వారు భారతీయ సంస్కృతిని గౌరవించి ఉద్ధరించినవారే. హైందవ సంస్కృతి పలువిధాలుగ పరిణతి చెందడానికి భారతదేశానికి వలస వచ్చినవారి పాత్ర చిన్నదికాదు.చరిత్ర పుటలు తిరగవేస్తే ఒక నిజం తెలుస్తుంది.

అది ఏమిటంతే తురుష్కులు, మంగోలులు, అరబులు ఎవ్వరు కూడ భారతీయ సాంప్రదాయాలను తుడిచిపెట్టడానికి ప్రయత్నించలేదు. బ్రిటిషువారు కూడ తొలుత తాము హైందవ సంస్కృతిని ఉద్ధరించామని ప్రగల్భాలు పలికిన వారే.  

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

మహమ్మద్ బిన్ తుఘ్లక్ కాలంలో ఢిల్లి లో హైందవ పండుగలు చక్కగ జరుపుకునేవారు. ఔరంగజేబ్  తన ఇరువది అయిదు సంవత్సరాల పరిపాలనా కాలం తరువాత మాత్రమే జిజియా పన్ను వేశాడు.

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

విజయ నగరాన్ని తురుష్కులు విధ్వంశం కావించారని చెబుతారు కాని ఒక నిజమేమిటంటె విజయనగర పాలకులు కూడ అంతకు ముందు తురక రజ్యాల్ని అదేవిధంగా విధ్వంశం చేశారని మరచిపోకూడదు. పూర్వపు విదేశీ పెత్తందార్లు ఇప్పటిలాగ మన భారతీయ సంస్కృతిని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసి ఉంటె అసలు హైందవ సంస్కృతి ఈ నేలపై ఇప్పుడు చూసే అవకాశం ఉండేది కాదేమో.

త్రిఋణములు,దైవ ఋణములు,పితృ ఋణములు,ఋషి ఋణములు,ఆశ్రమ ధర్మములు

ప్రస్తుతం మనం మనకు తెలియకుండానె పాటిస్తున్న సంస్కృతి ఏమిటి దీనిలో ప్రత్యేకత ఏమిటి ముందుగ తెలుసుకొందాము.

మానవ జీవితానికి అర్ధం హిందు మతం చక్కగ వివరిస్తుంది. సాంప్రదాయ బద్ధంగా పండితులు పామరులు అందరు జీవిత పరమార్ధన్ని  తరతరాలుగా సాధిస్తూనే ఉన్నరు. అది ఎలా సధ్యమయిందొ హిందువుల యొక్క రెండు ప్రధాన ఆచార ధర్మాల్ని పరిశీలిస్తే అర్ధమవుతుంది

అవే త్రిఋణ మరియు ఆశ్రమ సిద్ధాంతాలు. త్రిఋణ పద్ధతి ద్వార మనిషి కి సాత్వికత అలవడుతుంది. ఆశ్రమ ధర్మాలను పాటించడం  ద్వార మనిషి సంఘానికి అనుసంధానం చెయ్యబడతాడు.

త్రిఋణాలు అనగా మనిషికి ఈ భూమి మీద జన్మనిచ్చిన వారికి అతను మూడు విధాలుగ ఋణపడి ఉంటాడు. ఈ ఋణములను అతను తన జీవిత కాలంలొ తీర్చుకోవలసి ఉంటుంది. అవి ౧) దైవ ఋణములు, ౨) పితృ ఋణములు, ౩) ఋషి ఋణములు.

ఆశ్రమ ధర్మాలు (Chaturashrama dharmas) అనగా మనిషి జన్మ తంతు ప్రారంభమయినప్పటి నుండి పరమపదించేవరకు మనిషి వివిధ వయసులలో చెయ్యవలసిన కర్మలే.

నా ఈ పేజీలు  కూడా చదవండి

త్రిఋణములు

త్రిఋణముల గురుంచి మను స్మృతి లో ఏమి చెప్పారో చూద్దాము:

మహర్షి పితృదేవానాం గత్వా నృణ్యం యధావిధి

పుత్రే సర్వం సమాసజ్య వ సేన్మాధ్యస్ధ్యమాశ్రితః

గృహస్ధుడు వేదధ్యయనముచేత ఋషులఋణమును,పుత్రసంతతిం బడయుటచే బితౄణమును, యజ్ఞములచే దేవతలఋణమును శాస్త్రప్రకారముగ దీర్చికొని యోగ్యుడగు పుత్రుని యందు కుటుంబభారము నెల్ల నుంచి, తాను మధ్యస్ధుడై యేజోలికి బోక గృహమన నుండ వలయును.

దైవ ఋణములు

 మనిషి జన్మకు మూల కారణం దేవుడు కనుక మొదటగ మనిషి దేవతలకు ఋణము తేర్చుకోవాలి! యజ్ఞ యాగాదులు నిర్వహించడము దైవఋణములు తీర్చుకోవడనికి ఒక త్రోవగా చెప్పడమయినది. యజ్ఞ తంతు లో వైధిక దేవతలయిన ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, అస్విని దేవతలు మొదలయినవారిని పూజించడం చెయ్యవలెను. వివిధ రకాలయిన ద్రవ్యములు ప్రధానంగా ఆవు నెయ్యి యజ్ఞ కుండలిలొ అగ్నికి సమర్పించడం జరుగుతుంది.  తదుపరి భూతబలులు ఇచ్చి దేవతలకు ఆహారముగ సమర్పించడం జరుగుతుంది. అనగా యజ్ఞ  తంతు లో తోటి జనులకు విందు భోజనములు నిర్వహించాలన్నమాట.

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

పితృ ఋణములు

భౌతికంగా మనిషి కి జన్మనిచ్చిన జనకులకు, వారికి జన్మనిచ్చిన  వారి పితృలకు…ప్రతి మనిషి ఋణపడి ఉంటాడనేది పితృ ఋణ సిద్ధాంతానికి ప్రాతిపదిక కావొచ్చు. ఈ పితృ ఋణాలు భారతీయులు చక్కగా తీర్చు కుంటారు. అది ఎలానంటె ప్రధానంగా పిల్లల్ని కనడం ద్వారా! పిల్లల్ని సాంప్రదాయబద్ధంగా పెంచడం ద్వార!మన సాంప్రదాయములలొ వివహం ప్రతి మనిషి జీవితంలొ ఒక ప్రధానమయిన తంతు గా నిర్వహించబడుతుంది. “ధర్మ ప్రజా సంపత్యర్ధం రతి సుఖ సిధ్యర్ధం స్త్రియముద్వహె”ఈ వాక్యానికి అర్ధం ఏమిటంటె ధర్మాన్ని కాపాడడానికి, పిల్లల్ని కనడానికి, రతి సుఖాన్ని పొందడానికి భార్య చేయిని పట్టవలెను.”ప్రజయాహి మనుష్యా పూర్నాః” అనగా పిల్లల్ని కనడం వల్లనె మనిషి జన్మానికి పూర్ణత్వము లభిస్తుంది.

ALSO READ MY ARTICLES ON

“ఆచార్యాయ ప్రియమ్ ధనమహ్రుత్య ప్రజాతమ్తుమ్ మవ్యవత్సెత్సిహ్”

అనగా బ్రహ్మచర్య ఆశ్రమం నుండి గృహస్థాశ్రమంలోకి మారడానికి గురువుకు తగిన దక్షిణ సమర్పించుకొని ఆయన అనుజ్ఞ స్వీకరించి వివాహం చేసుకోవాలని చెప్పబడినది. ఇక్కడ విషేషమేమిటంటే  మనిషి తన యొక్క తన పూర్వికుల యొక్క వంశము నిర్మూలనము కాకుండా వుండడనికి తన ధర్మ నిర్వహణలో భాగంగా వివాహం చేసుకొని గృహస్థాశ్రమం స్వీకరించి పిల్లల్ని పొంది వారిని పెంచి పోషించడం చెయ్యవలెను. ఈ విధంగా పితృ ఋణాన్ని తేర్చుకోవలెను.

ఋషి ఋణములు

ఋషి ఋణములు అనగా సన్యాసులకు ఋణములు అని కాదు. ఋషులు అనగా మనకు జ్ఞ్నాన సంపదను అందించిన మన పూర్వ గురువులు. మనకు తరతరాలుగా వారసత్వంగా వస్తున్న వేదములు, పురాణాలు, వేదాంగాలు, ఇతిహాసాలు – రామాయణ, భారతాలు, ఉపనిషత్తులు, శిక్ష, నిరుక్తి, వ్యాకరణము, యోగ, మొదలయిన జ్ఞాన సంపదను మనకు అందించిన దైవంశ సంభూతులయిన మహా పురుషులే ఋషులు. వీరికి మనము అనగా హిందువులు ప్రత్యేకంగా ఋణపడి ఉంటారు.  పైన ఉదహరించిన శాస్త్రల్ని అభ్యసించడం ద్వారను జ్ఞ్నాన సముపార్జన చెయ్యడం ద్వారాను మరియు పర్వ దినాల్లో బ్రహ్మచర్యం , ఉపవాసము పాటించడం ద్వారాను హిందువులు ఋషులకు చెల్లించాల్సిన ఋణాల్ని తీర్చుకోవలెను. మనిషి తన ఈ జన్మ లో ఈ మూడు ఋణాల్ని తీర్చుకోవడం ప్రధానకర్తవ్యంఉ అని  తెలుసుకోవలెను.

ఆశ్రమ ధర్మములు

మనిషి ధర్మాన్ని ఆచరించడానికి, కాపాడడడానికి వివిధ కర్తవ్యాలు చెప్పబదినవి. అవే ఆశ్రమ ధర్మాలు: 1) బాల్యం  2) కౌమారం  3) బ్రహ్మచర్యం 4) గృహస్థాశ్రమమ్ం  5) వానప్రస్థం 6) సన్యాసం. బ్రహ్మచర్యం లోనే విద్య సముపార్జన జరగాల్సి ఉంది. అనగా బ్రహ్మచర్య దశలో ఋషి ఋణాలు కొంత తీర్చుకోవడం జరుగుతుందన్న మాట.గుహస్థాశ్రమంలో పితృ ఋణాలు దైవఋణాలు తీర్చుకోవడం చెయ్యల్సి ఉంటుంది.

Facebook20
X (Twitter)20
LinkedIn20
Share
WhatsApp20