గాయత్రీ మంత్రము

Rate this page

గాయతం త్రాయతే ఇతి గాయత్రి అన్నారు. అంటే ముల్లోకములలోను అనగా విశ్వ వ్యాప్తమయిన దివ్య శక్తికి ప్రతి రూపమైన సవితా దేవిని గాయత్రి మంత్రము (गायत्री-मंत्र) ను పఠించడము ద్వారా స్తుతిస్తున్నామని అర్ధముగా గ్రహించవచ్చు.

గాయత్రీ మంత్రమును పఠించడము వలన మనకు ఏ విధమైన ఫలితము ఉంటుందో అథర్వణ వేదములోని ఈ శ్లోకము చక్కగా వివరిస్తుంది.

గాయత్రి ఛందస్సు

“దివి విష్ణుర్వ్యక్రస్త జాగతేన ఛందసా తతో నిర్భక్తో యో స్మాన్ ద్వేష్టి యం చ వయం ద్విష్ట్మోన్తరిక్షే విష్ణుర్వ్యక్త్రస్త త్రైష్టుభేన ఛందసా తతో నిర్భక్తో యో స్మాన్ ద్వేష్టి యం చ వయం ద్విష్మః పృథివ్యాం విష్ణుర్వ్యక్త్రస్త గాయత్రేణ ఛందసా తతో నిర్భక్తో యో స్మాన్ ద్వేష్టి యం చ వయం ద్విష్ట్మోస్మన్నాదస్యై ప్రతిష్టాయాం అగన్మస్ట్వః సం జ్యోతిషా భూమ”

అనగా జగతి ఛందస్సు లో కూర్చిన ఋక్కులు/శ్లోకములను గానము చేసినప్పుడు జగతి యొక్క దివ్య శక్తి ముందుగా ఆకాశమును చేరి తిరిగి వెనుకకు వచ్చి బ్రహ్మ యొక్క శత్రువులను సంహరిస్తుంది. అలా ఈ లోకమునకు శాంతిని ప్రసాదిస్తుంది. త్రైష్టుప్ ఛందస్సు యొక్క శక్తి నీటిని గాలిని శుద్ధి పరుస్తుంది. గాయత్రి ఛందస్సు యొక్క దివ్య శక్తి ముందుగా స్వర్గ లోకమునకు చేరి తరువాత భూమి పైకి తిరిగి వచ్చి అందరికి సుఖ సంతోషములు ప్రసాదిస్తుంది అని అర్ధము.

గాయత్రీ మంత్రము:,భూర్భువః సువః,తత్ సవితుర్వరేణ్యం,భర్గో దేవస్య ధీమహి,థియో యో నః ప్రచోదయాత్

నా ఈ పేజీలు  కూడా చదవండి

గాయత్రి అనునది ఒక ఛందో రూప వేద శ్లోకము. ప్రతీ గాయత్రీ మంత్రములో 24 వర్ణములు ఉంటాయి. వేదములలోని ఎన్నో మంత్రములు గాయత్రి ఛందస్సు లో కూర్చినవి ఉంటాయి. అలాగే ప్రతి హిందూ దేవుణ్ణి స్తుతించే గాయత్రీ మంత్రములు ఉంటాయి. అయితే మనము అనగా హిందువులు అతి పవిత్రంగా భావించే గాయత్రి మంత్రము యొక్క ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాము. ఈ గాయత్రి మంత్రము సకల జీవ రాశుల ఉత్పత్తికి మనుగడకు మూలాధార మయిన ముల్లోకాలలో వ్యాపించి ఉండే ఆ సూర్యనారాయనుడి శక్తి స్వరూపమయిన సవితా దేవిని స్తుతించేటటు వంటిది. అందుచేత ఈ గాయత్రి మంత్రమునకు అంతటి ప్రాముఖ్యత వచ్చింది.

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

గాయత్రీ మంత్రము

ఓం భూర్భువః సువః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి థియో యో నః ప్రచోదయాత్

(ప్రతి పదార్ధము ఈ విధముగా చెప్పవచ్చు. ఓం, భూ = భూమి; భువ = భువనము; సువః = భారము మోయుచున్న; తత్ = మూలాధారము, ఇరుసు; సవితుర్ = సావిత్రీదేవి; వరేణ్యమ్ = ప్రధానముగా కోరదగినది; బర్గ = వ్యాపించు; దేవ + అస్య = దైవ శక్తి; ధీం = బుద్ధి, మతి; అహి = ప్రసాదించుము; థియో యో = కనికరించు; నః = నన్ను; ప్రచోదయాత్ = ఉత్తేజపఱచుము, ఎల్లప్పుడూ చేతనావస్తలో ఉంచుము.)

గాయత్రీ మంత్రము యొక్క అర్ధము ఇలా చెప్పవచ్చు, “ఓం, ఓ సవితా దేవీ! ఈ భూమ్యాకాశములు వాటివాటి స్థానములలో నెలకొనియుండడానికి నీవే ములాధారమయి ఉన్నావు, నీవే ఈ భూమ్యాకాశములలో సర్వత్రా వ్యాపించియున్న ప్రాణ శక్తివి అయి ఉన్నావు. అందరికి జీవనాధారము నీవే. నీవు మాపై కరుణ చూపి మాకు సద్బుద్ధిని ప్రసాదించి మమ్ములను ఎల్లప్పుడు ఉత్తేజవంతమయిన స్థితిలో ఉండేలాగున ఆశీర్వదించుము.”

  

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

భూః, భువః సువహ అనగా భూమి, ఆకాశము మరియి పాతాళము అని అర్థము.

ఈ త్రిభువనములకు సవితా దేవి ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది అని ఈ గాయత్రి మంత్రము చెబుతుంది. అయితే ఈ త్రిభువనములే మన త్రిపురములు అని ఇంతకు మునుపటి అధ్యాయములలో తెలుసుకునియున్నాము. త్రయంబకేశ్వరి స్థల దేవత కాగా సవితా దేవి విశ్వాంతరాళములకు దేవత.  అలా ఇద్దరూ  త్రిభువనములకు ప్రాణదాతలే అవుతున్నారు అని గ్రహించవలెను.

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

ALSO READ MY ARTICLES ON

Facebook20
X (Twitter)20
LinkedIn20
Share
WhatsApp20