Shop

“ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)” (pracheena bhaarateeyulaku akshara sumanjali, veda kala samajamu)

నేను “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)” (pracheena bhaarateeyulaku akshara sumanjali, veda kala samajamu) అను ఈ పుస్తకమును రచించి 2017 జనవరి నెల 21 వ తేదీన స్వంతముగా ప్రచురించియున్నాను. ఇప్పుడు జనవరి 2024 పునర్ముద్రించాను. నా ఈ పుస్తకము క్రౌన్ సైజ్ లో మొత్తము 265 పేజీల నిడివితో 58 చిత్రములు, 22 మ్యాప్ లు కలిగి ఉంటుంది. నా ఈ పుస్తకములో 250 పైన సంస్కృత శ్లోకములను తాత్పర్య సహితముగా ఇవ్వడమైనది. (అధర్వణ వేదం నుండి 85 శ్లోకములు, ఋగ్వేదము వేదం నుండి 30 శ్లోకములు, యజుర్వేదము వేదం నుండి 24 శ్లోకములు , మనుస్మృతి నుండి 15 శ్లోకములు, రామాయణం నుండి 95 శ్లోకములు సేకరించి ఈ పుస్తకములో ఉపయోగించడమైనది). పురావస్తు ఆధారాలను హిందూ గ్రంథములలో చెప్పిన అంశములను అనుసంధానము చేసి ప్రాచీన సప్త సింధు లోయ పరీవాహక ప్రాంతమే మన వేదభూమి అని ఈ పుస్తకము ద్వారా నేను చెబుతున్నాను. పురాణములలో ప్రస్తుతించిన త్రిపురములు ప్రాచీన సింధు లోయలోనే విలసిల్లినవని తగిన ఆధారాలు చూపాను. ప్రస్తుత హరప్పా పట్టణమే రామాయణములో చెప్పిన అయోధ్య అని చెబుతున్నాను. అలాగే ప్రస్తుత మొహంజోదారోనే రావణాసురుడు ఏలిన లంకా నగరమని తగిన ఆధారాలు చూపాను. అలాగే వాస్తు శాస్త్రము సప్త సింధు ప్రాంతములోని భౌగోళిక అంశాలకు ఆధారపడి తయారయిందని చెప్పడానికి తగిన ఆధారాలు చూపాను. ఇంకను సంస్కృత భాష అంటే ఏమిటి, శివుని లింగ రూపంలోనే ఎందుకు పూజిస్తారు, బ్రహ్మను ఇప్పుడు ఎవరి రూపంలో పూజిస్తున్నారు, వేద కాలంలో రాముని, కృష్ణుని, శివుడిని ఆరాధించలేదేమిటి… ఇంకను ఇటువంటి ఎన్నో అంశములకు సమాధానములు నా పుస్తకములో చెప్పియున్నాను. – పుస్తక రచయిత జనార్ధన్ ప్రసాద్

Facebook20
X (Twitter)20
LinkedIn20
Share
WhatsApp20