Cart

You may be interested in…

Please note that Coupon Code for Free Shipping is applied Automatically. Hence, you need not enter any Code and leave the Coupon code field as it is.

Your cart is currently empty!


New in store

“ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)” (pracheena bhaarateeyulaku akshara sumanjali, veda kala samajamu)

ఈ పుస్తకము మొత్తము 265 పేజీల నిడివితో క్రౌన్ సైజ్ లో ముద్రితమయినది. ఈ పుస్తకములో 49 అధ్యాయములు కలవు. హిందూ గ్రంథములలో చెప్పిన చారిత్రక అంశములకు పురావస్తు ఆధారములను అనుసంధానము చేసి ప్రాచీన సప్త సింధు లోయ పరీవాహక ప్రాంతమే మన వేద భూమి అని ఈ పుస్తకములో చెప్పడమయినది. ఆ విధంగా ఆర్యులు ద్రావిడులు వేరు వేరు జాతులు అనే సిద్ధాంతము ఒక పెద్ద అపోహ అని తేలిపోతుంది. ఈ పుస్తకములో వేదములు, రామాయణము, మనుస్మృతి మొదలగు హిందూ గ్రంధములనుండి సంగ్రహించిన 250 పైన సంస్కృత శ్లోకములను తాత్పర్య సహితముగా ఇవ్వడమైనది. అన్నీ అంశములు సులభంగా అర్ధం కావడానికి రచయిత స్వంతముగా తయారుచేసిన 58 చిత్రములు, 22 మ్యాప్ లు రచయిత వాడియున్నారు. ఈ పుస్తకములో వాల్మీకి రామాయణములో ఉటంకించిన భౌగోళిక వివరములకు పురావస్తు ఆధారములను సరిపోల్చి చూపి ప్రస్తుత హరప్పా పట్టణమే అసలు అయోధ్య అని, అలాగే ప్రస్తుత మొహంజోదారో పట్టణమే రావణాసురుడు ఏలిన లంకా నగరమని అదే మేలుహా అని చెప్పడమయినది. మరియు పౌరాణిక చతుర్యుగములు సప్త సింధు ప్రాంతములోనే జరిగినవని లెక్కలు కట్టి చెప్పడమయినది.

ఇంకనూ అఘోరులు ఎవరు, బ్రహ్మ తయారుచేసిన బాణములను  రుద్రులు వాడడమేమిటి? శివుణ్ణి లింగ రూపములోనే ఎందుకు పూజించాలి, సంస్కృతము ప్రాకృతము ఒకే భాష నా?…. ఇలా హిందూ ధర్మము లోని ఎన్నో ప్రశ్నలకు సమాధానములు కూడా ఈ పుస్తకము లో లభిస్తాయి. పుస్తకము చదివి మీ అభిప్రాయములను తెలియజేయండి. – రచయిత, పరిశోధకుడు, పబ్లిషర్ జనార్ధన్ ప్రసాద్ DVS. (ప్రధమ ముద్రణ 2017, పునర్ముద్రణ జనవరి, 2024) Read my Book and make a Review of the Book and give me FIVE Stars. – Janardhan Prasad. నా ఈ పుస్తకమును చదివి మీ అభిప్రాయములను తెలియజేయండి. – జనార్ధన్ ప్రసాద్

Facebook20
X (Twitter)20
LinkedIn20
Share
WhatsApp20