సరస్వతీ నది

Rate this page

వేదములలో సప్త సింధు నది ప్రస్తావన చాలా పర్యాయములు వచ్చును. అలాగే సరస్వతీ నది ప్రస్తావన కూడా. వేదాలలో సరస్వతి పేరు ఒక నదిని సూచించడానికే గాకుండా ఒక దేవీ గానే ఎక్కువగా ప్రస్తావించడము జరుగుతుంది. సప్త సింధు నదులలోని మొత్తము నదుల సంఖ్య ఏడు. కాని ప్రస్తుతము భౌగోళికంగా ఆరు నదులు మాత్రమే మనుకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతము జీలమ్ నదిని పూర్వపు వితస్త  నదిగా చరిత్రకారులు గుర్తించారు. అలాగే చేనాబ్ ను పూర్వపు అసికిని గాను, రావి నదిని పూర్వపు పురిష్ణి గాను, బియాస్ ను విపాస గాను, ప్రస్తుత సట్లుజ్‌ను పూర్వపు శతుద్రి గాను చరిత్రకారులు గుర్తించడము జరిగినది. అయితే పూర్వపు సప్త సింధు నదులలో అతి పవిత్రమయిన సరస్వతి నది యొక్క ఉనికిని సరిగా గుర్తించలేదు. ​

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

సరస్వతి సప్తధీ సింధుమాతా

( ఈ పాఠము నేను పరిశోధించి రచించిన “పాచీన భారతీయులకు అక్షర సుమాంజలి ” అను పుస్తకములోనిది. అధ్యాయము  9,  సప్త సింధు నదులు’) . . సప్త అనగా ఏడు అని అర్ధము. సింధు అనగా నీరు అని అర్ధము. సంస్కృతములో నీటికి వేరువేరు పేర్లు కలవు. ఉదాహరణకు  అథర్వణ వేదములో శ్రావ్యమయిన శబ్దము చేసుకుంటూ పారే నీటిని నది అంటారని, భూమిలోనుండి ఉబికి వచ్చే నీటిని ఉదకము అంటారని ఇలా వివరణ కలదు. ఒక విధముగా సప్తసింధు అనగా సప్త నదులలో గల పవిత్ర జలము గా భావించవచ్చు. మరియొక విధముగా  ఏడు నదులు అనుకోవచ్చు.

సరస్వతీ నది,సింధు నది,సప్త సింధు,సప్త సరస్వతీ

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

    సరస్వతిదేవిని ప్రస్తుతించే ఋగ్వేదములోని ఈ శ్లోకము చూద్దాము,   ” సరస్వతి సప్తధీ సింధుమాతా “, ఈ పదాలకు అర్ధము మనము ఈ విధముగా చెప్పవచ్చు.

“సరస్వతీ దేవి ఏడు నదులలోని నీటిని తన మహిమతో పావనము చేస్తుంది. మరియు సరస్వతీ దేవి నీటి ప్రవాహములకు తల్లి లేక మాత.” అనగా సరస్వతీ దేవి అన్ని నదులలోను వెలసి ఉంటుంది అని అర్ధము. ప్రస్తుతము మనము ఎక్కడ ఉన్న నీటిని అయినా గంగ అని ఎలా పిలుస్తున్నామో పూర్వము ఏనదినయిన సరస్వతి అని ఏ నీటినయినా సింధు నది అని పిలిచేవారని మనము గ్రహించాల్సి ఉంది. ఋగ్వేదమునుంచే మరో శ్లోకము చూద్దాము.

అమ్బితమే నదీతమే దేవితమే సరస్వతి! అప్రశస్తా ఇవ స్మసి ప్రశ స్తిమమ్బ నస్కృధి!!

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

పైన మనము సరస్వతీ దేవిని చిత్రకారులు సాధారణముగా ఒక కొయ్య మొద్దు పై ఆసీనురాలయినట్లు చూపిస్తుంటారని తెలుసుకున్నాము. అయితే ఆమె ఆసనము ఒక సరస్సు ప్రక్కన అనగా ఒక నది గట్టుపై ఉన్నట్లు కూడా మనము గమనించవచ్చు. నిజానికి సరస్సు అనగా ఒక తటాకము లేక చెఱువు అని అర్ధము. అది ఒక నది కూడా కావచ్చు. అప్పుడు సరస్వతి అనగా సరస్సులో గాని సరస్సు వద్ద గాని వేంచేసి ఉన్న  దేవి గా అర్ధము చేసుకోవాలి. అలాగే వేదకాలములో సరస్వతీ దేవిని ఒక అమ్మ గానే కాక ఒక నదీమతల్లి గా, సింధు మాత గా కూడా పూజించారని తెలుసుకున్నాము. ఆమెను ‘సప్తధీ’ అని అనగా ఏడు నదులలోని నీటిని పుష్టి పరిచేదని శ్లాఘించినట్లు గ్రహించాము. తొలుత ఆ దేవి అన్ని తటాకములలోను, నదులలోను వెలిసి ఉండేది. కాలక్రమేణా సరస్వతీ దేవిని ఒక నదిగా స్మరించుకోవడము మొదలుపెట్టారు.

నా ఈ పేజీలు  కూడా చదవండి

ALSO READ

(ప్రాచీన సింధునదివాసులు ఆ ప్రాంతమును వదిలిపెట్టి ప్రస్తుత భారతదేశములోని వివిధ ప్రాంతములకు వచ్చివేసిన తరువాత సరస్వతీ దేవిని ఒక నదిగా పూజించడము మొదలుపెట్టియుంటారు. కాలక్రమేణా వేదములు పుట్టిన ప్రాంతము కావున ఆ ప్రాంతములోని ప్రధాన జీవనది సరస్వతి నది కావున  మిగతా ఆరునదులు సరస్వతీ నదిని చేరుతుండడమువలన వేదమాతగా సరస్వతీ దేవిని కొలవడము మొదలుపెట్టియుంటారు.) మను స్మృతి లోని ఈ క్రింది శ్లోకము చూద్దాము,

సరస్వతీదృషద్వత్యోర్దేవనద్యోర్యదంతరమ్, తం దేవనిర్మితం దేశం బ్రహ్మావర్తం ప్రచక్షతే

    అర్ధము: “సరస్వతీ దృషద్వతీ అనే  రెండు దేవ నదుల మధ్య విస్తరించియున్న ప్రదేశమును బ్రహ్మావర్తము అని పిలుస్తారు. ఈ ప్రదేశమును దేవతలు నిర్మించారు.” . . .

ALSO READ MY ARTICLES ON

Facebook20
X (Twitter)20
LinkedIn20
Share
WhatsApp20