భారతీయ హిందు సంస్కృతి

Rate this page

భారతీయ హిందు సంస్కృతి కి ఘనమైన చరిత్ర ఉంది. మత సామరస్యత హిందూ వేద సంస్కృతియొక్క విశిష్టత. ఈ విషయాలను తెలియజేయడానికి ఈ వ్యాసము (A Rich Cultural Heritage పేరున) ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో  4. 5.1993  తేదీన వ్రాయడమయినది. (బాబ్రి మసీదు కూల్చివేసిన తరువాత జరిగిన ప్రాణ మరియు ఆస్థి నష్టాన్ని సమర్ధిస్తూ ఝున్ ఝున్ వాలా అనే ఆయన హిందు వ్యతిరేక మతాల్ని నియంత్రించడానికి హిందువులు కత్తి పట్టవచ్చని దానికి వేదాల అనుమతి వుందని వాదిస్తు ఒక వ్యాసం వ్రాశాడు. దీనికి సమాధానంగ హిందు మతం చాలా పరిణతి చెందిన మతమని హింసను హిందు మతం ప్రోత్సహించదని వివరిస్తు నేను వ్రాసిన వ్యాసమిది).

(గమనిక: ఈ వ్యాసము 1993 లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వ్రాసినది. అప్పట్లో సింధులోయ వాసులు వేరు వేదములు రచించిన ప్రాచీనులు వేరు అనే ధోరణిలో ఈ వ్యాసము ఉంటుంది. అయితే ప్రస్తుతము నా పరిశోధనలలో సింధులోయ వాసులే వేద జనులని తేలినది. ఈ వివరములు నేను రచించిన “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి” అను గ్రంధములో పొందుపర్చియున్నాను.)

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

స్వామి దయానంద సరస్వతి

“స్వామి దయానంద సరస్వతి అనే ఆయన 135 సంవత్సరాల క్రితం భారతీయులకు  జాతీయతా భావం హిందువుల్లో కల్పించడానికి హిందువుల్ని  సామాజికంగాను రాజకీయం గాను జాగృతి చేయడాన్కి పూనుకున్న మహానుభావుల్లొ ఒకరు. అప్పట్లో ఆయన ఏమన్నాడంటే ” మన వేదములు అన్నిటికి మూలం.

ప్రధానంగా ఋగ్వేదం లో అన్ని వున్నాయి. వేదాల్ని ఎవ్వరు తప్పు పట్టడాన్కి వీలు లేదు.”

భారతీయ హిందు సంస్కృతి,సింధు లోయ నాగరికత,ఋగ్వేదము,భారతీయ సంస్కృతి,చరిత్ర,అహింస,భక్తి తత్వము,శ్రీ కృష్ణ భగవానుడు

ఈయన అన్న మటల్లొ సత్యం ఉంది. ఏందుచేతనంటె మన పవిత్ర గ్రంధాలంటె మనకు గౌరవం ఉండాలి కదా!

అయితే ముస్లింల లేక క్రైస్తవుల ఖురాన్ మరియు బైబిల్ వంటి పుస్తకాల లోని వ్రాతల వంటి ఘనీభవించి వుండే సూత్రాల్ని భారాతీయులు తమ మతంలొ ఎప్పుడు ఒప్పుకోరు. ఉపనిషత్తుల లొ గురువు  ఏమంటారంటె ” రా ఇలా కూర్చో శిష్యా మనిద్దరం విభేదించుకుంటు చర్చించుకుందాం “

అంటే భారతీయులు తర్కానికి ఇచ్చె విలువ ఘనీభవించి ఉండె చాందస వాదాల్కి ఇవ్వరని గుర్తించాలి. 

దేశ   కాలమాన పరిస్తుతులకు అనుగుణంగా మారుతు వస్తున్న మతం హిందు మతం.

క్రైస్తవులకు పోప్ అలాగె ముస్లింలకు ఖలీఫ ఉన్నట్లుగా హిందువులకు ఎప్పుడు మత నియంత లేడు. లోకో భిన్న రుచి అనేది లోక నానుడి. అందరి అభిరుచులు అందరి అభిప్రాయాలు అభిమతాలు గౌరవించుకుంటు సహజీవనం సాగించడమే హీందు జీవన సరళి.

నా ఈ పేజీలు  కూడా చదవండి

మనయొక్క హిందు సంస్కృతి ఎప్పుడు మొదలయింది ఎ ఏ విధంగ పరిణతి చెందింది , మూలాలు ఎమిటి దేశీయ విదేశీయ శత్రువుల్ని ఎలా సామరస్యంగా ఎదుర్కొంటు , మమైకం చేసుకొంటు ముందుకు సాగుతూ వస్తుందో సావధానంగ గమనిద్దాం.( ఇక్కడ ప్రాచీన చరిత్ర మాత్రమె చర్చించడమయినది).

వీరి పురాతన సాంస్కృతిక విశేషాలు 90 సంవత్సరాల క్రితమ్ వరకు ఎవరికి తెలియదు. అంటే మాక్స్ ముల్లర్ అనే జర్మన్ , విన్సెంట్ స్మిత్ అనే బ్రిటిషు చరిత్ర  కారులకు ఈ ప్రాచీన సింధు నాగరికత గురుంచి తెలియనే తెలియదు. అలాంటప్పుడు మక్స్ మిల్లర్ వేదాల గురించి చెప్పిన విషయాలని  ఇప్పుడు   పాటిస్తాననడం ఎంతవరకు సమంజసం ?

సింధు లోయ నాగరికత

సింధూ లోయలో అప్పటి ముఖ్య పట్టాణాల ప్రస్తుత పేర్లు మొహెంజొదారో, హరప్ప, లోథాల్, కలిబంగం  మొదలగునవి. వీరు ప్రపంచంలో, వారికాలం లో  ఎక్కడా లేని భూగర్భ మురుగు నీటి కాల్వలు ఏర్పాటు చేసుకుని జీవించారు. వస్త్రాలు తయారు చెయడానికి వ్యాపార పద్దతిలో దూది మొక్కలు పెంచారు.

2,3 అంతస్థుల భవనాలు కాల్చిన ఇటుకులతో నిర్మించుకున్నారు. ధాన్యం నిల్వ చేయడానికి భవనాలు నిర్మించారు. ధాన్యం దంచడానికి సపటాలు నిర్మించుకున్నారు. పట్టణాలలొని రహదారులు ఒకదానినొకటి 90’ ల కోణం లో కలిసి వున్నాయి. బరువులు తూచడానికి వాడిన తూకపు రాళ్ళు అతి తక్కువ బరువును కూడ సరిగ్గా తూచే విధంగా తయారు చేయబడ్డాయి. తూకపు రాళ్ళు యొక్క కొలమాణం 6 మరియు 16 వాటి  గుణింతపు లెక విభాజ్యపు సంఖ్యలుగా ఉండెవి.

రాగితో తయారు చేసిన సామాన్లు వాడారు. వరి, ధాన్యం పండించారు. మనకి రాగి చెంబు, వరి అన్నం, నూలు వస్త్రం ఇప్పటికి ఎంతో పవిత్రం కదా!

వీరు అప్పటి   మెసపుటోమియ, సుమేరియ , బర్హత్, ఇస్రాయిల్, ఈజిప్ట దేశాలతో వానిజ్య సంబంధాలు కలిగియున్నారు.వీరి మతాచారాలు భారతీయులు ఇప్పటికి అనుసరిస్తూనే ఉన్నారు. యోగ ముద్ర లో ఉన్న పశుపతి శివుని ప్రతిమగల బిళ్ళలు ఇక్కడ దొరికాయి. ఒక స్త్రీ దేవతా  మర్రి వృక్షం మధ్యలో ఉన్నట్లు ఒక ప్రతిమలో ఉంది. నందీశ్వరుడు, శివలింగాలు, పానవట్టాలు మొదలయిన హిందూ దైవ ప్రతిమలు ఇక్కడ చాలా దొరికాయి.

పుష్కర పుణ్య స్నానాలు, సింధూ నాగరిక భారతీయులు అప్పట్లోనే ఆచరించినట్లు మనకు తెలుస్తుంది. మొహెంజొదారొలో పెద్ద స్నానపు ఘట్టం , జలాశయం ,  బట్టలు మార్చుకునే గదులు తో , మురుగు నీటి పారుదల సదుపాయంతో సహా కాల్చిన ఇటుకులతో నిర్మించుకున్నరు.

ఇంతటి ప్రశస్థమైన సింధూ నాగరికతకు భారతీయులు వారసులమని చెప్పుకోవడానికి గర్వించ దగిన విషయం. 

A rich cultural heritage of india, భారతీయ హిందు సంస్కృతి
This essay was written by me, DVS Janardhan Prasad, and was published in The Indian Express dt 04.05.1993

ఋక్ వేద (ఋగ్వేదము) కాల భారతీయ సంస్కృతి / చరిత్ర

ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం ప్రస్తుత పంజాబ్, హర్యాన, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, యమునా నదీ ప్రాంతంలొ ఋగ్వేద సంస్కృతి విలసిల్లినట్లుగా చరిత్ర కారులు భావిస్తారు. వీరు ఇనుముతో తయారు చేసిన   ఆయుధాలు వాడారు. వీరు తొలుత సంచార జీవులు. భారత దేశం వచ్చాక వీరు వ్యవసాయం చేసుకోవడం నేర్చుకున్నారు. వీరికి ఉన్న గుఱ్ఱాలు వీరు వేగంగా ప్రయాణించడానికి దోహదపడేవి. వీరు మాంసా హారులు. బార్లి ప్రదాన ఆహార పప్పు దినుసు.9

ఇప్పటికి మనం రోగులకు బార్లి జావ ఇస్తున్నాము కదా! అప్పట్లొ ఆవు/ గోవు వారికి ఇప్పటిలాగ పవిత్రమయినది కాదు. గోవు యొక్క విందు వారికి అతి ఇష్టమైన భోజనంగా చెప్పవచ్చు. అతిధిని గోఘ్న అని , యుద్ధాన్ని గవిష్టి అని వ్యవహరించెవారు.

ALSO READ MY ARTICLES ON

ఋగ్ వేద కాల జనులు పూజించిన దేవుళ్ళను ఇప్పుడు మనం వదిలివేశాము. వారు పూజించిన దేవుళ్ళ పేర్లు ఇవి – ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, ద్యుః (ఆకాశ దేవత), పృథ్వి, అశ్విని దేవతలు, ఉష, ప్రజాపతి, శ్రద్ద, మన్యు, యమ మొదలయిన వారు.

ఇప్పటికి పెళ్ళి మొదలయిన శుభ కార్యాల్లో వాడే   అరివేణి  కుండలు వంటి కుండలు వారు తయారు చేసుకుని ఉపయోగించారు! వీరు ధరించిన వస్తువులు తొలుత తోలు, ఊలుతో తయారు చేసినవే.

ఋగ్వేద కాల జనులు యఙ్ఞాలు చేయలేదు. ఋగ్వేదం తరువాత సామవేదం తయారయ్యింది. సామవేదం అంటే ఋగ్వేదన్ని సంగీతం కూర్చి పాడటమె  . తరువాత యజుర్వవేదం  వచ్చింది. యజుర్వేదంలో యఙ్ఞాలు చేసే వివరాలు, యఙ్ఞ కుండలి నిర్మించే విధానం వివరించబడింది.

అంటే అప్పట్లో భారతదేశంలో వాడుకలో ఉన్న యఙ్ఞ విధానాన్ని వీరు అనుకరించి అభివృద్ధి చేసారేమో!

తరువాత అధర్వణ వేదం వచ్చింది. ఈ నాల్గవ వేదంలో తాయొత్తులు, క్షుద్ర పూజలు , వైద్యం మొదలైన విషయాలు చెప్పబడ్డవి.

అంటే యఙ్ఞాల పేర సాగిన హింసకు ప్రతిగా అధర్వనవేదంలో సాత్వికంగా మానవుని అవసరాలు తీర్చడానికి, భయాలు పొగొట్టడానికి, జబ్బులు తగ్గించడానికి  తాయొత్తుల శాస్త్రం పుట్టుకొచ్చిందేమో! 

అహింస, భక్తి – తత్వములు – శ్రీ కృష్ణ భగవానుడు

అహింస, కర్మ , ధర్మ , భక్తి అనే భావాలు హిందూ మతానికి మూల స్థంబాలుగా భావించవచ్చు . ఋగ్వేదం ప్రపంచంలోనే అతి పురాతన గ్రంధం గా పేర్కొన బడింది. అయితే భారతీయ తత్వం అక్కడితో ఆగిపోలేదు. తరువాత ఎన్నొ మార్పులు చేర్పులు కాల క్రమేణ  జరుగుతూ వచ్చాయి. ఋగ్వేద కాలముకన్నా ముందు భారతదేశంలో సింధూ లోయలో ఇప్పటికి 5000 సంవత్సరాల క్రితం విలసిల్లిన నాగరిక సమాజం హిందు / భారతీయ సంస్కృతికి మూలంగా భావించడమయినది. సింధూ లోయ నాగరికత  భౌగోళికంగా ప్రస్తుత సింధు, పంజాబ్, గుజరాత్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ , రాజస్థాన్ దేశ/రాష్ట్ర ప్రదేశాల లో విస్తరించి ఉంది. వీరి పురాతన సాంస్కృతిక విశేషాలు 90 సంవత్సరాల క్రితమ్ వరకు ఎవరికి తెలియదు. అంటే మాక్స్ ముల్లర్ అనే జర్మన్ , విన్సెంట్ స్మిత్ అనే బ్రిటిషు చరిత్ర  కారులకు ఈ ప్రాచీన సింధు నాగరికత గురుంచి తెలియనే తెలియదు. అలాంటప్పుడు మక్స్ మిల్లర్ వేదాల గురించి చెప్పిన విషయాలని  ఇప్పుడు   పాటిస్తాననడం ఎంతవరకు సమంజసం ?

ర్శిస్తు , భగవంతుని భక్తితో కొలవడం ద్వారా భగవంతుని ప్రసన్నం చేసుకోవచ్చని ఉద్భోదలు చేశారు. వీరు మధ్య భారత దేశంలో మొదట కాన వచ్చారు. నారధ ముని , శ్రీ కృష్ణ పరమాత్యుడు, అంగీరసుడు , సాండిల్యుడు మొదలైన వారు ఈ కోవకు చెందిన ప్రవక్తలు.

శ్రీ కృష్ణుడు భగవద్గీతలో ఈ విధంగా చెప్పారు, “వేదాలు భౌతిక విషయాల గురించి చెబుతాయి, ఒక పూర్తిగా ఙ్ఞానం సంపాదించిన మేధావికి వేదాలు ఎలాంటివంటే ఒక నది పూర్తిగా జలంతో నిండి ఉన్నపుడు నదిలో త్రవ్విన బావి ఉపయోగం వంటిది”.

భగవంతుడు యఙ్ఞాల్లో సాగించే బలిదాన హింసకు వ్యతిరేకంగా ఈ విధంగా చెప్పారు, “యఙ్ఞాల వల్ల వర్షాలు కురవవు. దట్టమైన అడవులు వర్షం కోసం యఙ్ఞాలు చేస్తున్నాయా? “

నారద ముని ఎమన్నాడంటే, ” అహం వదిలి భగవంతుని ధ్యానించడం వల్లనే మోక్షం వస్తుంది “అని. 

సాండిల్యుడు ఎమన్నాడంటే, ” భక్తి అంటే భగవంతుని ప్రేమించడమే, ప్రేమించడమంటే ద్వేషాన్ని త్యజించడమే”!

ఈ విధంగా, భారత సంస్కృతి ఎన్నో తత్వాలను , మనుష్య గణాల్ని, ప్రాంతాల్ని కలుపుకుంటూ నూతన వ్యక్తుల్ని, నూతన సమాజాల్ని వారి వారి భావాలని , కట్టుబాట్లని గౌరవిస్తూ తమ ఆచార వ్యవహారాల్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతూవస్తుంది. ఎమైనా అపశృతులు , ఉద్వేగాలు, తాత్కాలికం మాత్రమే!  “

Facebook20
X (Twitter)20
LinkedIn20
Share
WhatsApp20