పురుష సూక్తం వాస్తవానికి మానవజాతి మరియు విశ్వం యొక్క సృష్టిని వివరిస్తుంది. మరియు ఈ పురుష సూక్తం (Purusha Suktam) లో ఆది దేవుడు బ్రహ్మ యజ్ఞంలో బలి ఇవ్వబడినట్లు చెప్పబడింది. అలా బాలి ఇవ్వబడిన బ్రహ్మ యజ్న వేది నుండి మళ్లీ పుట్టుకురావడం ఈ కథ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే శూద్రులను పురుష సూక్తంలో విశ్వ పురుషుని యొక్క పాదాలుగా చిత్రీకరించడంపై వివాదం ఉంది. మానవ శరీరంలోని ఇతర భాగాలతో పోల్చినప్పుడు పాదాలు తక్కువ పవిత్రమైనవిగా హిందువులు పరిగణిస్తారు అని మనకు తెలిసిందే. కానీ మానవుని శరీరాన్ని పాదాలే మోస్తాయి. మరియు మానవుడు భూమిపై సంచారించాలంటే పాదాలు ప్రధానం. పురుష సూక్తం సుద్రులను విశ్వపురుషుని పాదాలతో పోల్చడం ద్వారా సమాజములో శూద్రుని యొక్క ప్రాముఖ్యతను తెలియ జేస్తుంది అని భావిస్తే బాగుంటుంది.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
శాంతి మంత్రం (ఋగ్వేదం 10.8.90)
ఓం తచ్ఛమ్ యోరావృణీమహే
గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞ పతయే
దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః
ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే
ఓం శాంతిః శాంతిః శాంతిః
నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి
పురుష సూక్తం
ఓం సహస్ర శీర్ షా పురుషః, సహస్రాక్షః సహస్రపాత్, స భూమిం విశ్వతోవృత్వా, అత్యతిష్ఠద్దశాంగులం,
పురుష ఎవేద గ్ం సర్వం, యద్భూతం యచ్చ భవ్యం, ఉతామృతత్వస్యేశానః, యదన్నేనాతిరోహతి,
ఏతావానస్య మహిమా, అతో జ్యాయాగ్ శ్చ పూరుషః పాదో2 స్య విశ్వా భూతాని, త్రిపాదస్యామృతం దివి
నా ఈ పేజీలు కూడా చదవండి
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః, పాదో~ స్యేహా~~భవాత్పునః, తతో విష్వజ్ వ్యక్రామత్, సాశనానశనే అభి,
తస్మాద్విరాడజాయత, విరాజో అధి పూరుషః, స జాతో అత్యరిచ్యత, పశ్చాద్భూమిమథో పురః
యత్పురు షేణ హవిషా, దేవా యజ్ఞమతన్వత, వసంతో అస్యాసీదాజ్యం, గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః, సప్తాస్యాసస్పరిధయః, త్రిః సప్త సమిధః కృతాః, దేవా యద్యజ్ఞం తన్వానాః, అబధ్నన్పురుషం పశుం, తం యజ్ఞం బర్ హిషి ప్రౌక్షన్, పురుషం జాతమగ్రతః 3
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
తేన దేవా అయజంత, సాధ్యా ఋషయశ్చ యే, తస్మాద్యజ్ఞాత్సర్వహుతః, సం భృతం పృషదాజ్యం, పశూగ్ స్తాగ్ శ్చక్రే వాయవ్యాన్, ఆరణ్యాన్గ్రామ్యాశ్చ యే, తస్మాద్యజ్ఞాత్సర్వహుతః 4
ఋచః సామాని జిజ్ఞిరే, ఛందాగ్ ం సి జిజ్ఞిరే తస్మాత్, యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత, యే కే చోభయాదతః, గావో హ జిజ్ఞిరే తస్మాత్, తస్మాజ్జాతా అజావయః,
యత్పురుషం వ్యదధుః, కతిధా వ్యకల్పయన్, ముఖం కిమస్య కౌ బాహూ, కావూరూ పాదావుచ్యతే, బ్రాహ్మణో2 స్య ముఖమాసీత్, బాహూ రాజన్యః కృతః ఊరూ తదస్య యద్వైశ్యః, పద్భ్యాగ్ ం శూద్రో అజాయత,
చంద్రమా మనసో జాతః, చక్షోః సూర్యో అజాయత, ముఖాదింద్రశ్చాగ్నిశ్చ, ప్రాణాద్వాయురజాయత, నాభ్యా ఆసీదంతరిక్షం, శీర్ష్ణో ద్యౌః సమవర్తత, పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రాత్, తథా లోకాగ్ ం అకల్పయన్
వేదాహమేతం పురుషం మహాంతం, ఆదిత్య వర్ణం తమసస్తుపారే, సర్వాణి రూపాణి విచిత్య ధీరః, నామాని క్రుత్వా౨భివదన్ యదాస్తే,
ధాతా పురస్తాద్యముదాజహార, శక్రః ప్రవిద్వాన్ప్రదిశశ్చతస్రః, తమేవం విద్వానమృత ఇహ భవతి, నాన్యః పంథా అయనాయ విద్యతే, యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః, తాని ధర్మాణి ప్రథమాన్యా సన్, తే హ నాకం మహిమానః సచంతే, యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః 7
అద్భ్యః సంభూతః పృథివ్యై రసాచ్చ, విశ్వకర్మణ: సమవర్తతాధి, తస్య త్వష్టా విదధ ద్రూపమేతి, తత్పురుషస్య విశ్వమాజానమగ్రే, వేదాహమేతం పురుషం మహాంతం, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్, తమేవం విద్వానమృత ఇహ భవతి, నాన్యః పంథా విద్యతే౨యనాయ, ప్రజాపతిశ్చరతి గర్భే అంతః, అజాయమానో బహుధా విజాయతే 8
తస్య ధీరాః పారిజానంతియోనిమ్, మరీచీనాం పదమిచ్చంతి వేధసః, యో దేవేభ్య ఆతపతి, యో దేవానాం పురోహితః, పూర్వో యో దేవేభ్యో జాతః, నమో రుచాయ బ్రాహ్మయే, రుచం బ్రహ్మం జనయంతః, దేవా అగ్రే తదబ్రువన్, యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్, తస్య దేవా అసన్ వశే 9
హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ, అహోరాత్రే ప్రార్శ్వే, నక్షత్రాణి రూపం, అశ్వినౌ వ్యాత్తం, ఇష్టం మనిషాణ, అముం మనిషాణ, సర్వం మనిషాణ. 10
ఓం శాంతిః శాంతిః శాంతిః
ALSO READ MY ARTICLES ON