ధర్మో రక్షతి రక్షితః అనే ధర్మ సూక్ష్మము అందరికి తెలిసిందే. అయితే ఈ ధర్మము మనుస్మృతి మనకు చెబుతుంది అని తెలిస్తే ఆశ్చర్యము కలుగుతుంది. మనుస్మృతి నుండి సంగ్రహించిన మరికొన్ని ధర్మ నియమములను గురించి ఇక్కడ మనం తెలుసుకుందాము.
మనుస్మృతి లోని వివిధ ధర్మ సూక్ష్మములు
విప్రాః ప్రాహు స్తథా చైతిద్యో భర్తా సా స్మృతాంగనా | ఏతావానేవ పురుషో యజ్జాయాత్మా ప్రజేతి హ
తా నొకడుమాత్రమే పురుషుడు గాడు. తాను, భార్య, బిడ్డడు ముగ్గురును జేరియే పురుషు డగును. కనుక నెవడు భర్తయో వాడే భార్య యగు నని వేదవేత్తలగు విప్రులు పలికిరి. కావున నాభార్యయందు బుట్టించిన పుత్రుడు భర్తకే చేరినవాడగును.
నా ఈ పేజీలు కూడా చదవండి
- మహాత్మా గాంధీ 1869-1915
- జవహర్లాల్ నెహ్రూ 1889-1940
- డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
సత్యం భ్రూయాత్
సత్యం బ్రూయా త్ప్రి యం బ్రూయా న్న బ్రూయా త్సత్య మప్రియమ్, ప్రియం చ నానృతం బ్రూయా దేష ధర్మస్సనాతనః
విన్నది విన్నట్లును, చూచినది చూచినట్లును చెప్పుట సత్యము. అట్టిసత్యమును జెప్పవలయును. ఎదుటవాని మనస్సుకు దగినట్లు చెప్పుట ప్రియము. అట్టి ప్రియమును బలుకవలయును. సత్యమయినను నప్రియమును జెప్పరాదు. ప్రియమయ్యును నసత్యమును బలుకరాదు. ఇది వేదమూలముగాన ననాదియైన ధర్మము.
రూపద్రవ్యహీనాంశ్చ జాతిహీనాంశ్చ నాక్షి పేత్.
అంగహీనులను, అధికాంగులను, వయసుచెల్లినవారిని, రూపము, ద్రవ్యములేనివారిని, జాతి హీనులను నాక్షేపింపరాదు.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
క్షత్రియం చైవ సర్పం చ బ్రాహ్మణం చ బ్రహుశ్రుతమ్
నావమన్యేత వై భూష్ణుః కృశానపి కదాచన.
ధన, ధాన్య, పశు, క్షేత్రాది సమృద్ధిగోరువాడు క్షత్రియుని, పామును, బహుశ్రుతుడగు బ్రాహ్మాణుని, నప్పుడు రిక్తస్ధితియందున్న వారినైనను ఎప్పుడును నవమానింపరాదు.
నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి
నాత్మానమవమన్యేత పూర్వాభి రసమృద్ధిభిః
అమృత్యోః శ్రియ మన్విచ్ఛేన్నైనాం మన్యేత దుర్లభామ్.
తనకొకప్పుడు వ్యాపారాదులవలన నష్టము సంభవించి, ద్రవ్యమంతయు బోయినను, దన్నుదాను నిందించుకొనరాదు. బ్రదికియున్నంతదనుకను ధనమసంపాదింప గోరవలయును. కలిమి దుర్లభమని యెంచరాదు.
అభివాదయే ద్వృద్ధాశ్చ
అభివాదయే ద్వృద్ధాశ్చ దద్యాచ్చైవాసనం స్వకమ్
కృతాంజలిరుపాసిత గచ్ఛతః పృష్ఠతోన్వియాత్.
ఇంటికి వచ్చిన పెద్దలను నమస్కరింపలయును. తనయాసనంబును వారి కొసంగవలయును. చేతులు జోడించికొని వారిదాపున గూర్చుండవలయును. వారు ముందు పోవుచుండిరేని, వెంబడించి పోవలయును.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
వారిదస్తృప్తిమాప్నోతి సుఖమక్షయ్యమన్నద:
హీనాంగానతిరిక్తాంగాన్ విద్యాహీనాక్ వయోధికాక్
తిలప్రద: ప్రజామిష్టాం దీపదశ్చక్షురుత్తమమ్
నీటి నిచ్చువడు తనివినొందును, అన్నము పెట్టువాడు నశింపని సుఖము నొందును. నూవుల నొసగువాడు కోరినసంతతిని, దీపదానము చేయువాడు మేలయిన దృష్టిని బొందును.
కల్లలాడుటచే యజ్ఞఫలము నశించును
యజ్ఞో నృతేన క్షరతి తపః క్షరతి విస్మయాత్
ఆయుర్విప్రాపవాదేన దానం చ పరికీర్తనాత్.
కల్లలాడుటచే యజ్ఞఫలము నశించును ( సత్యము చేతనే యజ్ఞము సార్ధక మగునని భావము). గర్వించుటచేత తపఃఫలము క్షీణించును. విప్ర దూషణముచేత ఆయువు క్షీణించును. పరులతో జెప్పి కొనుటచే దానము నిష్ఫలంబగును.
మహర్షి పితృదేవానాం గత్వా నృణ్యం యధావిధి
పుత్రే సర్వం సమాసజ్య వ సేన్మాధ్యస్ధ్యమాశ్రితః
గృహస్ధుడు వేదధ్యయనముచేత ఋషుల ఋణమును, పుత్రసంతతిం బడయుటచే బితౄణమును, యజ్ఞములచే దేవతల ఋణమును శాస్త్ర ప్రకారముగ దీర్చికొని యోగ్యుడగు పుత్రుని యందు కుటుంబ భారము నెల్ల నుంచి, తాను మధ్యస్ధుడై యేజోలికి బోక గృహమన నుండ వలయును.
ధర్మో రక్షతి రక్షితః
ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః
తస్మాద్ధర్మోన హంతవ్యో మా నో ధర్మో హతో వధీత్.
ధర్మము చెఱుపబడినదై మనలను జెఱచును. ధర్మమును మనము గాపాడితిమేని, మనలనది కాపాడును. కావున ధర్మమును నశింపజేయబడనిదై మనలను నశింప జేయకుండునుగాక.
మన్యంతే వై పాపకృతో న కశ్చిత్పశ్యతీతి నః
తాంస్తు దేవాః ప్రవశ్యంతి స్వస్యైవాంతరపూరుషః
పాపకారులు మనల నెవ్వరు చూడలేదని తలంతురుకాని, యట్టిపాపకారులను నీచెప్పబోవు దేవతలును, తనయంతరాత్మయు జూచుచున్నారు.
ALSO READ MY ARTICLES ON