చతురాశ్రమములు
చతురాశ్రమ ధర్మములు: బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము అనునవి చతురాశ్రమములు అని చెప్పబడినవి. యవ్వన కాలములోనే బ్రహ్మచర్యము, గృహస్తాశ్రామము వచ్చును. వృద్ధాప్యములో వానప్రస్థము, సన్యాసము అను ఆశ్రమములు ఉండును. బ్రహ్మచర్యం (Brahmacharya) లోనే విద్య సముపార్జన జరగాల్సి ఉంది. అనగా బ్రహ్మచర్య దశలో ఋషి ఋణాలు కొంత తీర్చుకోవడం జరుగుతుందన్న మాట. గృహస్థాశ్రమం (Grihasthashrama Dharma) లో పితృ ఋణాలు దైవఋణములు తీర్చుకోవడం చెయ్యల్సి ఉంటుంది.
గృహస్థాశ్రమము
గ్రుహస్థాశ్రమ ప్రశస్థి: గృహస్త ప్రజ్ఞా లక్షణము:
దయా శ్రద్దాక్షమా లజ్ఞా త్యాగశ్శాన్తిః కృతజ్ఞతా గుణాః యస్యభవన్త్యేతే గృహస్థోముఖ్య ఏవ సః (వ్యాస మహర్షి ఉవాచ)
దయ, శ్రద్ద, ఓర్పు, లజ్జ, సదసద్వివేకము, త్యాగము, కృతజ్ఞత మున్నగు గుణముల కలిగిన గృహస్తుడు ఉత్తముడు.(వ్యాస మహర్షి ఉవాచ)
గృహస్థాశ్రమ ప్రశస్థి:
వానప్రస్థో బ్రహ్మచారీ యతిశ్చైవ తధ ద్విజాః
గృహస్థస్య ప్రసాదేన జీవన్యేతే యథావిధిః
గృహస్థ ఏవ యజతి గృహస్థ్స్తప్యతే తపః
దదాతిచ గృహస్థశ్చ తస్మాచ్ఛ్రేయో గృహాశ్రమే (పరాశర ముని ఉవాచ)
వానప్రస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, ద్విజులు మున్నగువారు గృహస్థుని ఆధారముచేతనే తమతమ ఆశ్రమ ధర్మములను నెరవేర్చుకొనుచూ జీవిస్తున్నారు.
ఇందు మూలముచేతనే గృహస్తాశ్రమము సర్వ శ్రేష్ఠ మయినది.
(పరాశర ముని ఉవాచ)
యథా వాయుం సమా శ్రిత్య వర్తంతే సర్వజంతవ:
తథా గృహస్థమాశ్రిత్య వర్తంతే సర్వ ఆశ్రమా:(మను స్మృతి)
ప్రాణదాయువు నాశ్రయించి జంతువులెల్ల జీవించునట్లు, గృహస్థుని నాశ్రయించి తక్కిన యాశ్రమస్థులు జీవింతురు.(మను స్మృతి)
యస్మాత్త్రయో ప్యాశ్రమిణో జ్ఞానేనాన్నేన చాన్వహమ్
గృహస్థేనైవ ధార్యంతే తస్మాజ్జ్యేష్ఠాశ్రమో గృహీ(మను స్మృతి)
గృహస్థుడు తక్కినయాశ్రమముల వారిని వేదాధ్యయనము చేయించియు, అన్నపానముల నొసగియు బ్రతిదినము వారిని పోషించుచున్నాడు గావున గృహస్థుడన్ని యాశ్రమముల వారిలో శ్రేష్ఠుడన బడును. (మను స్మృతి)
(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారత రాజ్యాంగము, పౌర హక్కులు, స్వాతంత్ర్య పోరాటము మరియు ఆంధ్రుల చరిత్ర మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)
సర్వేషామపి చైతేషాం వేదస్మృతివిధానతః
గృహస్ధ ఉచ్యతే శ్రేష్ఠః స త్రీనేతాక్ బిభ ర్తి హి(మను స్మృతి)
ఈ నాలుగాశ్రమములవారిలో శ్రుతిస్మృతులందు జెప్పబడుటవలనను గృహస్ధుడెయు త్తముడనబడును. అతడే కదా తక్కుంగల మూడాశ్రమములవారిని బోషించుచున్నాడు. కావునను ఇతడే శ్రేష్ఠుడు.(మను స్మృతి)
యధా నదీనదాస్సర్వే సాగరే యాంతి సంస్ధితిమ్
తధైవాశ్రమిణస్సర్వే గృహస్ధే యాంతి సంస్ధితిమ్.(మను స్మృతి)
అన్ని నదులను నదములను సముద్రమును జేరునట్లు తక్కిన యాశ్రమములవారందరు గృహస్ధునిపై నాధారపడియున్నరుగాన, వానిని జేరుచున్నారు.(మను స్మృతి)
వివాహము
ప్రజయాహి మనుష్యః పూర్ణః అన్నారు. ఇక్కడ ప్రజలు అనగా పిల్లలు. ప్రతి పురుషుడు పెండ్లి చేసుకొని సంతానవంతుడు అయినపుడే అతని జీవితమునకు పూర్ణత్వము ప్రాప్తిస్తుంది అని ఈ శ్లోకమునకు అర్ధము.
అలాగే ” ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః” అన్నారు. అనగా బ్రహ్మచారి వేదాధ్యయనము పూర్తి అయిన తరువాత ఆచార్యుల వారికి అనగా గురులకు తగిన దక్షిణనొసగి గురువుల అనుమతి తీసుకొని తన, తన పితరులయొక్క వంశాభివృద్ధి కొరకు వివాహము చేసుకొనవలెను. మరియొక శ్లోకమును గమనిద్దాం:
” ధర్మ ప్రజా సంపత్యర్ధం రతిసుఖ సిధ్యర్ధం స్త్రియముద్వహే ” అన్నారు.
అనగా మానవ ధర్మాన్ని నిర్వర్తించడానికి వంశాభివృధ్ధి కొరకు సంతానవంతులవడానికి ప్రాకృతమయిన రతిసుఖము బడయడానికి స్త్రీ యొక్క చేయి పట్టవలెను. ఇక్కడ ఒక విశేషము గమనించవలెను.అనగా మనిషి సంఘజీవిగా నిర్వర్తించవలసిన బాధ్యతలు ( మానవ ధర్మము ) ప్రధమ విధి గాను, తరువాత సంతానము బడయడము ద్వారా వంశాభివృధ్ధి చెయ్యడం ఆ తరువాత చివరిగా రతిసుఖము చెప్పరి. ( కామమునకు చివరి స్థానము ఇచ్చారు )
గర్భాదానము
దంపతుల ప్రధమ సమాగమాన్ని గర్భాదానమని వ్యవహరిస్తారు. వివాహం తరువాత జరిగాల్సిన తంతు ఇది. అయితే ప్రసుతం వివాహ సమయం లోనె గర్భాదాన మంత్రాలు కూడ వల్లించి చదివెస్తున్నారు.
ఈ మంత్రం ఇలా ఉంటుంది: “దాంపత్యో: ఆయుర్భోగ శోభావృద్ధ్యర్ధం అస్యాం భార్యాయాం ప్రధమ్ గర్భ సంస్కారద్వారా సర్వగర్భ శుద్ధ్యర్ధం గర్భాదానాఖ్యం కర్మ కరిష్యే”.
ధర్మ ప్రజా సంపత్త్యర్ధం రతి సుఖ సిత్త్యర్ధం స్త్రియముద్వహే అన్నరు అనగా ఒక స్త్రీని వివాహం ద్వార చేపట్టడం ప్రధమంగ ధర్మాన్ని రక్షించడనికి అని తరువాత పిల్లల్ని కనడం ద్వారా వంసాన్ని ఉద్ధరీచడనికి చివరిగ రతి సుఖానికి అని చెప్పడం విశేషం.
పుంసవనం
పంచ దశ కర్మలు లేక షోడశ కర్మలు:
మానవుని జన్మ కారణం దగ్గరనుండి మొదలు పెట్టి జీవిత చరమాంకం వరకు మనిశికి శాస్త్ర రీత్య జరుగవలసిన ఉపచారములు లేక కర్మలు పంచ దశ కర్మలు లేక షోడశ కర్మలుగ నిర్దేశించ బడినవి.
అవి వరుసగ: ౧. గర్భదానము, ౨. పుంసవనము, ౩. సీమంతము, ౪. జాతకర్మ, ౫. నామకరణమ్, ౬. అన్నప్రాసనం, ౭. చౌలం, ౮. అక్షరారంభం, ౯. ఉపనయనం, ౧౦. ప్రజాపత్యం, ౧౧. సౌమ్యమ్, ౧౨. ఆగ్నెయమ్, ౧౩. వైస్వదేయం, ౧౪. స్నాతకం, ౧౫. వివాహం, ఆఖరుగ ౧౬. అంత్యేష్టి.
పైన వివరించిన కర్మలలో చివరి కర్మ మినహాయించినపుడు పంచదశ కర్మలుగాను పదహారవ కర్మ అంత్యేష్టి తో కలిపి షొడశ కర్మలు గాను చెబుతారు. ఈ కర్మలనె సంస్కారములు అని కూడ అంటారు.
( ఒక చిత్రమయిన విశయమేమిటంటె ౧౫౦ సంవత్సరాల పూర్వం బ్రిటిశు వారు ఈ కర్మలను ఎలా ఎగతాళి చేశారొ ప్రస్తుతం చదువుకున్న వారు కూడ అదే బాణీలొ ఈ సంస్కారాలలోని లోపాలను మాత్రమి ఎత్తి చూపిస్తు వీటి లోని మహాశయాలను విస్మరిస్తున్నారు . అయితే ఎవరి పంధాలొ వారు ఈ కర్మలను తరతరాలుగ పాటిస్తుఉనె వ్య్న్నరు).
(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswati, సరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavarta, బ్రహ్మావర్తము, Aryanism, ఆర్యజాతి వాదము. )