అక్షీభ్యాంతే సూక్తం

Rate this page

కొరోనా కోవిడ్19

కొరోనా లేక కోవిడ్19 మహమ్మారి భారతీయ సమాజంలో విజృంభిస్తున్న సమయంలొ జనులు ఋగ్వేదంలో ఉన్న అక్షీభ్యాంతే సూక్తం (Aksheebhyaam te suktam) పఠించడము వలన మానసిక స్థైర్యాన్ని ధైర్యాని పొందగలరని భావిస్తున్నాను. కొరోనా రానివారు వ్యాధి సోక కుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాధి వచ్చిన వారు తగిన వైద్యం చేయించుకుంటూ కూడా ఈ శ్లోకం పటించవచ్చు. ఈ అక్షీభ్యాం తే సూక్తం ఈ విషయమే చెబుతుంది.

ఒకరికి రోగము తగ్గడానికి ఎటువంటి మంత్రాలు వల్లెవేయ్యాలో ఒక ప్రక్క చెబుతూనే మందులు వెయ్యడం మానవద్దని, ఏ మనిషి అయినా సరే బ్రతికి ఉన్నంతవరకు అతనికి చెయ్యవలసిన వైద్యం, శుష్రూషలు చేస్తూనే ఉండాలి అని మన సనాతన హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి.

యావత్కంఠ గతాః ప్రాణాః యావన్నశ్యతి చేంద్రియం

తావచ్చికత్సా కర్తవ్యా కాలస్య కుటిలా గతిః

అర్థం: భగవంతుని ఇచ్ఛ, మానవ కర్మ గతులు నెవ్వరికి విదితం కాదు. (అంటే మానవుని ఆయుష్షు దేవుడు నిర్ణయిస్తాడు అని తెలుసుకోవాలి) అందుచేత రోగికి ఇంద్రియములు పనిచేయుచున్నంత వరకు కంఠం లో ప్రాణమున్నంత వరకు నివారణము లేని రోగాములయినా సరే చికిత్స చెయ్యడం మాన కూడదు అని ఈ శ్లోకం చెబుతుంది.

అక్షీభ్యాం తే,కొరోనా,కోవిడ్19,మహమ్మారి,అక్షీభ్యాంతే సూక్తం

నా ఈ పేజీలు  కూడా చదవండి

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

మన ఋగ్వేదం మరియు అథర్వణ వేదం రెండిటి లోను “అక్షీభ్యాం తే” అను ఈ సూక్తం కనిపిస్తుంది. ఈ సూక్తం ప్రస్తుత కరోనా వైరస్ లాంటి జబ్బు ను ప్రస్తావిస్తుంది. ఈ శ్లోకం రోగిని ఉద్దేశిస్తూ ఆ రోగి త్వరలోనే సదరు రోగం నుంచి విముక్తుడవ్వాలని ఆకాంక్షిస్తుంది.

(అథర్వణ వేదంలో మంత్ర విద్యలు తాయెత్తు లకు సంబంధించిన విషయాలు ఉంటాయని ఒక అపోహ ఉంది. కాని అదే అథర్వణ వేదంలో వివిధ రకాల వ్యాధులను నివారించడానికి ఉపయోగపడే ఔషధముల వివరములు ఉంటాయి. ఆయుర్వేద వేద వైద్యుపితామహులు చరకుడు మరియు శుష్రూతుడు ఇద్దరు కూడా తాము అథర్వణ వేదం నుండి ఎంతో నేర్చుకున్నామని చెప్పారు.)

(కరోనా గో గో అన్న తరువాత ఈ శ్లోకం పఠించవచ్చు)

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

అక్షీభ్యాం తే

ఓం అక్షీభ్యాం తే నాసికాభ్యాం కర్ణాభ్యాం ఛుబుకాదధి,

యక్ష్మం శీర్షణ్యం మస్తిష్కాజ్జిహ్వాయా వి వృహామి తే  1

అర్థం: నీ కళ్ళ లోను, ముక్కు లోను, చెవులలోను, చుబుకం లోను, తలలోను, మెదడు లోను, నాలుక లోను తిష్ట వేసి ఉన్న ఈ మహమ్మారి యక్ష్మ రోగం శీఘ్రమే బయటకు వెడలిపోవు గాక!

గ్రీవాభ్యస్త ఉష్ణిహాభ్యః కీకసాభ్యో అనూక్యాత్

యక్ష్మం దోషణ్య (అ) 2మంసాభ్యాం బాహుభ్యాం వి వృహామి తే   2

అర్థం: నీ కంఠం లోను, తల లోను, ఎముకలలోను, కీళ్ల లోను, భుజములలలోను, ముంజేతి లోను, కండరముల లోను, చేతులలోను తిష్ట వేసి ఉన్న ఈ మహమ్మారి యక్ష్మ రోగం శీఘ్రమే బయటకు వెడలిపోవు గాక!

ఆన్త్రేభ్యస్తే గుదాభ్యో వనిశ్తోహృదయాదధి

యక్ష్మం మతస్నాభ్యాం యక్నః ప్లాశిభ్యో వి వృహామి తే  3

అర్థం: నీ ప్రేవుల లోను, గుదము లోను, కడుపులోను హృదయం లోను, మూత్రపిండాలలోను వృషణముల లోను తిష్ట వేసి ఉన్న ఈ మహమ్మారి యక్ష్మ రోగం శీఘ్రమే బయటకు వెడలిపోవు గాక!

ఊరుభ్యాం తే ఆష్ఠీవద్భ్యాం పార్ష్ణిభ్యామ్ ప్రపదాభ్యా మ్

యక్ష్మం శ్రోణిభ్యాం భాసదాద్భం ససో వి వృహామి తే   4

అర్థం: నీ తొడల లోను, కీళ్ల లోను, మోకాళ్ళలోను, అరికాళ్ళలోను, నడుము లోను, వెన్ను లోను ఇంకా అంతర్గత శరీర భాగాలలోనూ తిష్ట వేసి ఉన్న ఈ మహమ్మారి యక్ష్మ రోగం శీఘ్రమే బయటకు వెడలిపోవు గాక!

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

మేహనాద్వనమ్కరణాల్లోమాభ్యస్తే నఖేభ్యః

యక్ష్మం సర్వస్మాదాత్మనస్తమిదం వి వృహామి తే   5

అర్థం: నీ జననాంగముల లోను, మూత్రకోశం లోను, వెంట్రుకలలోను, గోళ్ళ లోను, నీ అన్ని అవయవముల లోను తిష్ట వేసి ఉన్న ఈ మహమ్మారి యక్ష్మ రోగం శీఘ్రమే బయటకు వెడలిపోవు గాక!

అంగదాన్గాల్లోన్మో లోన్మో జాతం పర్వణి పర్వణి

యక్ష్మం సర్వస్మాదాత్మనస్తమిదం వి వృహామి తే

అర్థం: నీకు వచ్చిన వ్యాధి ఏ కీలు ద్వారా నీ శరీరం లోనికి ప్రవేశించిందో ఆ కీలు పరిశుభ్రమగుగాక! నీ యొక్క అన్ని అవయవములనుండి ఈ మహమ్మారి యక్ష్మ  రోగం బయటకు వెడలిపోవు గాక!

ఒమ్ శాంతిః శాంతిః శాంతిః

యావత్కంఠ గతాః ప్రాణాః యావన్నశ్యతి చేంద్రియం

తావచ్చికత్సా కర్తవ్యా కాలస్య కుటిలా గతిః

అర్థం: భగవంతుని ఇచ్ఛ, మానవ కర్మ గతులు నెవ్వరికి విదితం కాదు. అందుచేత రోగికి ఇంద్రియములు పనిచేయుచున్నంత వరకు కంఠం లో ప్రాణమున్నంత వరకు నివారణము లేని రోగాములయినా సరే చికిత్స చెయ్యడం మాన కూడదు.

అంటే వ్యాధి తగ్గాలని దేవుని ప్రార్థించినా వైద్యం చెయ్యడం మానవద్దని సారాశం.

అలాగే వైద్యో నారాయణా హరిః అన్నారు. వైద్యుడు మనకు మన ఎదురుగా కనిపించే దేవుడు అని భావించి వైద్యులను గౌరవించాలి అని గమనించాలి.

ALSO READ MY ARTICLES ON

Facebook20
X (Twitter)20
LinkedIn20
Share
WhatsApp20